వివరాలు వెల్లడించిన ఎస్ ఐ శ్రావణ్ కుమార్ .
అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
పగటివేళలో చెత్త ఏరుకుంటూ ఇంటికి తాళాలు వేసిన ఇండ్లను గమనించి ఎవరూ లేని సమయంలో తాళాలు పగలగొట్టి ఇంటి లోపల గల బిందెలను ఇతరత్రా సామానును దొంగలించి అమ్ముకుంటున్న సుల్తానాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. ఉడుత వైష్ణవి, లోకిని స్వప్న, లోకిని లచ్చమ్మ, కట్ల రజిత,కట్ల శ్రీనివాస్ లు చెత్త ఏరుకుంటూ ఇనుప సామాన్లు అమ్ముకుంటూ వచ్చిన ఆదాయం సరిపోక దొంగతనాలకు అలవాటుపడ్డారు. మంగళవారం రోజున గర్రెపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న ఇంటికీ ఎవరూ లేని సమయంలో రాడు సహాయంతో తాళం పగలగొట్టి ఇత్తడి సామాన్లు దొంగతనం చేసి పారిపోతుండగా దర్యాప్తులో భాగంగా సుల్తానాబాద్ పోలీసులు శాస్త్రి నగర్ వద్ద చాకచక్యంగా నలుగురు దొంగలు పట్టుకున్నామని వాళ్ల దగ్గర దొంగిలించబడిన సొత్తును స్వాధీన పరుచుకున్నామనీ కట్ల శ్రీనివాస్ తప్పించుకున్నాడని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సుల్తానాబాద్ ఎస్ ఐ శ్రావణ్ కుమార్ తెలిపారు.
