అగ్నిధారన్యూస్ పెద్దపల్లి. పెద్దపల్లి జిల్లా మంథని ఎంపీఓ గా విధులు నిర్వర్తించిన ఎండి ఆరిఫ్ హుస్సేన్ పై ఆమండలం పంచాయతీ కార్యదర్శులు 2024 మే 30వ తేదీన పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీకి మండలంలోని 24 మంది పంచాయతీ కార్యదర్శులు అవినీతి, అక్రమాలు, బెదిరింపులకు, గురి చేస్తున్నాడు అంటూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఇట్టి విషయం తీవ్రంగా పరిగణించి మరుసటి రోజు 31.5.2024 రోజున పెద్దపల్లి జెడ్పి సీఈవో నరేందర్ ను, ఇట్టి విషయంపై ఎంక్వైరీ ఆఫీసర్ గా నియమించారు. విచారణ చేపట్టారు. అనంతరం అప్పటి జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఎంపీఓ ను ఆరిఫ్ పంచాయతీరాజ్ శాఖ ప్రధాన కార్యాలయానికి సరెండర్ చేస్తే ఉత్తర్వులు జారీ చేశారు…. అదే విషయమై ఈరోజు 19.10.2024 రోజు మరోమారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మండల మహిళా సమైక్య భవనంలో, కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశాల మేరకు. జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి రవీందర్, 24 మంది పంచాయతీ కార్యదర్శులతో పాటు, ఎంపీఓలకు, నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టారు.