జిల్లా గ్రంథాలయ చైర్మన్ అన్నయ్య గౌడ్ కి శాలువాతో సన్మానం.
మార్కెట్ కమిటీ చైర్మన్ గా మినుపాల ప్రకాష్ రావు..
ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన వివేక్ వెంకటస్వామి.
అగ్నిధారన్యూస్, సుల్తానాబాద్:
ఎన్నో రోజులుగా ఉత్కంఠతతో ఎదురుచూస్తున్న పెద్దపల్లి జిల్లాలోని సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ ఎవరన్నది నేటితో ఉత్కంఠతకు తెరపడింది..ఈ చైర్మన్ పదవి కోసం చాలామంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు పోటీలో ఉన్నప్పటికీ నేడు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి జైపూర్ మండలo ఎల్కంటి గ్రామం లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ ను శాలువాతో సన్మానించడంతోపాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మినుపాల ప్రకాష్ రావును సన్మానించడంతో, సుల్తానాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రకాష్ రావుకె,? కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది. దీంతో చాలామంది నాయకుల్లో ఈ చైర్మన్ పదవి సస్పెన్స్ కు తెరపడింది. ఏది ఏమైనా ఈ రెండు మూడు రోజులలో అధికారికంగా మినుపాల ప్రకాష్ రావుకూ సుల్తానాబాద్ మార్కెట్ చైర్మన్ గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది…


