20వేలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు

అగ్నిధారన్యూస్ పెబ్బేర్ వనపర్తి జిల్లా:
పెబ్బేర్ మున్సిపల్ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ దాడులు నిర్వహించారు. రూ.20000/లు లంచం తీసుకుంటుండగా మున్సిపల్ కమిషనర్ ఆదిశేషు ను మహబూబ్ నగర్ ఏసీబీ అడిషనల్ ఎస్పీ బి.శ్రీకృష్ణ గౌడ్ పట్టుకున్నారు. . ఏసీబీ అడిషన ల్ ఎస్పీ బి.శ్రీకృష్ణ ష్ట్ర గౌడ్ మాట్లాడుతూ గత ఏడాది
ఒక కాంట్రాక్టర్ చేసిన పనులకు రూ.2.6 లక్షలు బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు. ఈ బిల్లుల చెల్లింపు కోసం రూ.25000/ల లంచం ఇవ్వాలని కమిషనర్ డిమాండ్ చేయగా, కాంట్రాక్టర్ రిక్వెస్ట్ మేరకు రూ.20000/కు అంగీకరించారు. దీంతో కాంట్రాక్టర్ ఏసీబీని ఆశ్రయించారు.
లంచం తీసుకుంటుండగా దాడి
ఒక కాంట్రాక్టర్ నుంచి రూ.20000/ తీసుకుం టుండగా మున్సిపల్ కమిషనర్ ఆదిశేషును ప ట్టుకున్నామని అడిషనల్ ఎస్పీ బి.శ్రీకృష్ణ గౌడ్ తెలిపారు. ఏసీబీ అధికారులను కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయగా, తాము నోట్లు ఇచ్చామని, అవే నోట్లను కమిషనరు కాంట్రాక్టర్ ఇచ్చారన్నారు. కాంట్రాక్టర్ లంచం ఇచ్చి బయటకు వచ్చిన త ర్వాత తాము వెళ్లి పట్టుకున్నామని చెప్పారు. తన తోపాటు పది మంది సిబ్బంది ఉన్నారన్నారు. ఇంకా సోదాలు జరుగుతున్నాయని తెలిపారు.

రేపు నాంపల్లి కోర్టులో హాజరు…

లంచం తీసుకుంటున్న మున్సిపల్ కమిషనర్ ఆదిశే షును విచారణ అనంతరం అరెస్టు చేసిన నాంప ల్లిలో ఉన్న ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తామని శ్రీ కృష్ణగౌడ్ తెలిపారు. ప్రస్తుతానికి అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నామని, రికార్డులు కూడా త నిఖీ చేస్తున్నామని చెప్పారు.