అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్

సుల్తానాబాద్ మండల కేంద్రంలోని గట్టపెల్లి శివారు ప్రాంతంలో నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే. బుర్హాన్ మియాపేట గ్రామంలో వీఆర్ఏ పని ముగించుకొని  గౌరు నిరంజన్ నిన్న రాత్రి సమయంలో గట్టపెల్లి గ్రామానికి  వెళ్తుండగా ప్రమాదవశాత్తు మోటారు  సైకిలు కింద పడడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సుల్తానాబాద్ ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు.