అగ్ని ద్వారా న్యూస్, పెద్దపల్లి:

ఉత్తమ ఫలితాలు సాధించిన ట్రినిటీ విద్యార్థులను అభినందించిన మున్సిపల్ చైర్ పర్సన్ మమతా రెడ్డి

పెద్దపల్లి ట్రినిటీ డిగ్రీ కళాశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. గురువారం శాతవాహన యూనివర్సిటీ సెమిస్టర్ 1,IV,VI విడుదల చేసిన డిగ్రీ ఫలితాల్లో కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ స్థాయి ర్యాంకులు సాధించారు. సుమన శ్రీ 9.96, సోనియా 9.66, అనూష 9.66, సాయి ప్రీతి 9.66 సాధించారు.
ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను మున్సిపల్ చైర్ పర్సన్ డాక్టర్ దాసరి మమత రెడ్డి గారు అభినందించారు.. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ P. రాజు, వైస్ ప్రిన్సిపాల్ M. నీత రెడ్డి మరియు అధ్యాపక బృందం పాల్గొన్నారు.