అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:

పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని భవిత సెంటర్ లో సమగ్ర శిక్ష పెద్దపల్లి జిల్లా సెక్టోరల్ ఆఫీసర్ శ్రీ విజయ్ కుమార్, పెద్దపల్లి మండల విద్యాధికారి శ్రీ సురేందర్ కుమార్ ఆధ్వర్యంలో శుక్రవారం ఫిజియోథెరపీ సేవలు ప్రారంభించబడినాయి. ఈ ఫిజియోథెరపీ క్యాంపులో వారు మాట్లాడుతూ కరోనా కారణంగా18 నెలల నుండి ఈ ఫిజియోథెరపీ సేవలు నిలిపివేయబడినాయి ఇకనుండి.ప్రతి శుక్రవారం పెద్దపల్లి భవిత కేంద్రంలో ఫిజియోథెరపీ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు ఈ సేవలను దివ్యాoగ విద్యార్థులు ఉపయోగించుకోవాలని కోరినారు.  ఈ రోజు జరిగిన క్యాంపు లో వివిధ గ్రామాల నుండి దివ్యాంగుల పిల్లలు, మరియు తల్లిదండ్రులు,రిసోర్స్ టీచర్స్ లకన్, సంధ్యారాణి ఫిజియోథెరపీ డాక్టర్ సంధ్యారాణి  పాల్గొన్నారు.