అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి రూరల్:
ప్రకృతి చాలా గొప్పది దాన్ని మనం ఎంతగా ప్రేమించి కాపాడితే అంతగా అందాలను పంచుతుంది సృష్టిలోని సరచర జీవరాసులు అన్నీ ఈ ప్రకృతిలో జీవిస్తాయి అలాంటి వాటిలో వృక్షజాతి విశిష్టత యొక్క ప్రాముఖ్యతను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు జీవకోటికి ప్రాణాధారం ప్రాణవాయువు చెట్లు ప్రకృతి లో ఉండే అటువంటి కార్బన్ డయాక్సైడ్ ను తీసుకుని ప్రపంచానికి ఆక్సిజన్ని వదులుతూ ఉంటాయి .తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హరితహారం ప్రోగ్రాం లో మొదటి విడతలో పెరిగిన అటువంటి చెట్లు ప్రయాణికులను కట్టిపడేస్తున్నాయి పెద్దబొంకూర్ నుండి కొలనూర్ కి వెళ్ళే దారిలో కొత్తపల్లి కి కొలనూర్ కి మధ్యన వచ్చిపోయే వాహనదారులకు చలువ పందిళ్లు వేసాము మీకోసమే ద్వారా తోరణాలు కట్టాము అన్నట్లుగా చెట్లు రోడ్డుకిరువైపులా కనబడుతు ఆహ్లాదం ఇస్తుంటాయి. ఈ దారి వెంట వెళ్లినప్పుడు ఒకసారి తొలగించండి
