అగ్నిధార న్యూస్, మేడిపల్లి మండలం:

జగిత్యాల జిల్లా ఉమ్మడి మేడిపల్లి  మండల ప్రెస్ క్లబ్ క్యాలెండర్  ప్రముఖ పుణ్యక్షేత్రమైన  వేములవాడ రాజరాజేశ్వర స్వామి  సన్నిధిలో  రవాణా శాఖ  మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో సోమవారం రోజున  మండల ప్రెస్ క్లబ్ నూతన సంవత్సర  క్యాలెండర్ ను  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజలను నిరంతరం చైతన్యా పరుస్తున్న పత్రిక మిత్రులకు ఎల్లవేళలా  మా ప్రభుత్వ సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. అదేవిధంగా ప్రభుత్వం విప్ ఆది శ్రీనివాస్  మాట్లాడుతూ నియోజకవర్గంలో మండల ప్రజల యొక్క సమస్యలను పత్రికా ముఖంగా ఎల్లవేళలా తెలియజేస్తూ ప్రజలకు ప్రభుత్వ సేవలు  అందేలా చేస్తున్న పత్రిక మిత్రులకు కృతజ్ఞతలు  తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చింతకింది లక్ష్మీపతి, ప్రధాన కార్యదర్శి మార్గ మహేష్, వైస్ ప్రెసిడెంట్లు పుల్లూరు దేవయ్య, మహమ్మద్ రహీం, కోశాధికారి చిరంజీవి, గౌరవ అధ్యక్షులు ఎదిలాపురం దయాకర్, పుప్పాల  రామ్ రెడ్డి, కార్యవర్గ సభ్యులు ఆంజనేయులు, పల్లికొండా గణేష్, బక్కురి నరేష్, మహమ్మద్ రఫీ, దోమల ప్రేమ్ కుమార్, అందే అశోక్, నీలగిరి ప్రవీణ్ రావు లు పాల్గొన్నారు.