అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి) 

కడ్తాల్ మండలంలోని పలు గ్రామాల్లో సంక్రాంతి పర్వదినం సందర్భంగా  క్రికెట్ టోర్నమెంట్ లను లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, కడ్తాల్ మాజీ జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ ముఖ్య అతిథిగా పాల్గొని  ప్రారంభించారు.  ముందుగా గానుగమర్ల గ్రామపంచాయతీలో స్థానిక నాయకులతో కలిసి క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన ఆయన తదుపరి నార్లగుంట గ్రామపంచాయతీలో క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో,  మాజీ సర్పంచులు హరిచంద్ నాయక్, రాములు నాయక్, పూజ దేవా నాయక్, డైరెక్టర్  సేవ్య నాయక్, మాజీ ఉపసర్పంచ్ శారదా పాండు, మాజీ వార్డు సభ్యులు శ్రీను నాయక్ ,శంకర్ నాయక్, శ్రీకాంత్, రామచందర్,  రాజు, మహేష్ ,జగన్,  చందర్, భాస్కర్ ,నాయకులు క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.