తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ కార్పొరేషన్ మాజీ వైస్ చైర్మన్.
ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ జన్మదిన వేడుకలు.
అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి)
కల్వకుర్తి నియోజకవర్గంలోని కల్వకుర్తి పట్టణంలో తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షుడు, బిఆర్ఎస్వీ కల్వకుర్తి అధ్యక్షుడు దారమోని గణేష్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర మిషన్ భగీరథ కార్పొరేషన్ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ జన్మదిన వేడుకలను ఉప్పల వెంకటేష్ సైన్యంతో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి ఘనంగా నిర్వహించడం జరిగింది.ఉప్పల వెంకటేష్ జన్మదినం సందర్భంగా కల్వకుర్తి పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిరుపేద వృద్ధులకు దుప్పట్లను పంపిణీ చేయడం ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేయడంతో పాటుగా అనాధ పిల్లలకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది . పట్టణంలోని మహబూబ్ నగర్ చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులతో కలిసి కేక్ కట్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో, కార్మిక సంఘం అధ్యక్షుడు సూర్యప్రకాష్ రావు, కల్వకుర్తి బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు బావండ్ల మధు, బిఆర్ఎస్వి కల్వకుర్తి అధ్యక్షుడు దారమోని గణేష్, బిఆర్ఎస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గుమ్మకొండ రాజు, కౌన్సిలర్ నూనె యాదమ్మ శ్రీను, బిఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు వట్టేపు కిషోర్, బిఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు నరేందర్, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రామకృష్ణ, తాళ్ల సురేష్ గౌడ్, నాగరాజు యాదయ్య ,సిద్ధగోని రమేష్ గౌడ్ ,మాజీ సర్పంచులు కృష్ణయ్య, మేకల శ్రీనివాసులు, కాజా, రమేష్, దేవయ్య, శివ, కిరణ్, విష్ణు, రవి, ఆంజనేయులు,అల్లుడు కృష్ణ, పురుషోత్తం, శ్రీశైలం యాదవ్, పాండు తదితరులు పాల్గొన్నారు.
