అన్ని జిల్లాలో ప్రారంభమైన మహిళా శక్తి క్యాంటీన్లు.
పెద్దపల్లిలో ప్రారంభం ఎప్పుడో..?
జిల్లా సమైక్యపై ఆశాఖ అధికారుల సీత కన్ను.
పట్టించుకోకపోవడం ప్రధాన కారణం.
కొత్తగా వచ్చిన డిఆర్ డిఓ ప్రత్యేక దృష్టి సారించాలి.
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి జిల్లా )
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలు అన్ని రంగాలతో పాటు, వ్యాపార రంగంలో రాణించాలని, కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని, పదేపదే చెబుతూ.. మహిళా సంక్షేమం తోపాటు, మహిళా సాధికారత వైపు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగా గ్రామాల్లో మహిళ స్వయం సహాయక సంఘాల్లో పనిచేస్తున్న గ్రామ సమైక్య అధ్యక్షురాల్లను ప్రభుత్వ పాఠశాలల్లో, పాఠశాల చైర్మన్ లుగా నియమిస్తూ బాధ్యతలు అప్పగించారు. ఆయా పాఠశాలలకు అవసరమైన మౌలిక వసతులు కల్పనకు, నిధులు కేటాయిస్తూ, పాఠశాల చైర్మన్ కు బాధ్యతలు అప్పగిస్తూ,వేలాది మంది మహిళలకు కాంట్రాక్టర్లుగా అవకాశం ఇచ్చారు.అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు కావలసిన యూనిఫామ్ లు కుట్టే బాధ్యత ఆయా మండలాలలో అర్హత గల మహిళా సంఘ సభ్యులకి అప్పగించారు. అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కార్యక్రమం మహిళా శక్తి క్యాంటీన్లు బీహార్ రాష్ట్రంలో 2018 నుంచి విజయవంతంగా కొనసాగుతున్న దీదీ కి రసోయ్ తరహాలో సేర్ఫ్ అధికారుల బృందం అధ్యయన అనంతరం మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహించాలని తలపెట్టారు. ఒక్కొక్క జిల్లాకు దాదాపు 5 మహిళా శక్తి క్యాంటీన్లను నెలకొల్పాలని నిశ్చయించారు . రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు200 మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. తద్వారా మహిళలకు ఉపాధి కల్పించడమే కాకుండా, వ్యాపార రంగంలో రాణిస్తారని ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్లు, ప్రభుత్వ హాస్పిటల్స్, దేవాలయాలు, బస్టాండ్ సమీప ప్రాంతం, పారిశ్రామిక,పర్యాటక ప్రాంతాలు, ప్రభుత్వ కార్యాలయాలు జన సమూహం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లను ఏర్పాటుకు అంకురార్పణ జరిగింది.
క్యాంటీన్ ప్రారంభానికి డి ఆర్ డి ఓ అధికారుల నిర్లక్ష్యం.
ప్రభుత్వ సహకారంతో నెలకొల్పబడే మహిళా శక్తి క్యాంటీన్లు పెద్దపల్లి జిల్లాకు ఐదు కేటాయించారు. పెద్దపల్లి, సుల్తానాబాద్, ధర్మారం, మంథని తోపాటు .పెద్దపల్లి ఐడిఓసి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కాంప్లెక్స్.. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంకు కేటాయించబడ్డాయి
కలెక్టరేట్లో నిర్వహించ తలపెట్టిన మహిళా శక్తి క్యాంటీన్ కి గత ఆరు నెలలుగా గ్రహణం పట్టింది.. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల సమీకృత కార్యాలయాలలో దాదాపు ఆరు నెలల క్రితమే ప్రారంభమయ్యాయి. పెద్దపల్లిలో మాత్రం నేటికీ ప్రారంభానికి నోచుకోలేదు. ఆశాఖ అధికారుల అలసత్వం,అసమర్ధత ప్రభుత్వ ఆశయాన్ని వెక్కిరిస్తున్నట్లుంది…! మహిళా శక్తి క్యాంటీన్ కేటాయించే అధికారులు రాజకీయాలు చేయకుండా ప్రారంభించాలని ఆరు నెలలుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న, మహిళా సంఘాల నాయకులు, ఇప్పటికైనా జిల్లా సమైక్య నాయకులతో సమావేశం ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం అర్హులైన వారికి కేటాయించి, క్యాంటీన్ ప్రారంభించాలని అంటున్నారు. కొత్తగా వచ్చిన జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి అటువైపు దృష్టిసారించి, క్యాంటీన్ కు పట్టిన గ్రహణాన్ని వదిలించాలని ప్రజలు అంటున్నారు….

