అగ్నిధార న్యూస్, సుల్తానాబాద్:

మిషన్ భగీరథ నీటి సరఫరాను పరిశీలించిన మున్సిపల్ కమిషనర్…

సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని నాలుగో వార్డు,ఐదవ వార్డు ( పాత జెండా ,గౌడ వీధి, ప్రభు నగర్) ప్రతి ఇంటికి వెళ్లి మిషన్ భగీరథ నీటి సరఫరా ను శుక్రవారం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. నీటి సరఫరా సక్రమంగా  అవుతుందా లేదా అని ఇంటి యజమాని అడిగి తెలుసుకున్నారు. ఇకనుండి పొద్దున , సాయంత్రం రెండు పూటలా గంటసేపు నీటి సరఫరా అవుతుందని ఆయన అన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ , బిరుదు సమతా కృష్ణ , 5 వార్డు మున్సిపల్ కౌన్సిలర్ పారుపల్లి జ్ఞానేశ్వరి గణపతి నీటి సరఫరా గురించి ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో లో మిషన్ భగీరథ ఇ ఇ సతీష్, మున్సిపల్ సిబ్బంది బత్తిని కృష్ణ గౌడ్ నాంపల్లి విజయ్ పాల్గొన్నారు.