అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా:
రామగుండం పోలీస్ కమిషనరేట్ గంజాయి నిర్ములించడం ప్రతి ఒక్కరి భాద్యత
రామగుండం కమిషనర్ శ్రీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ”మత్తుపదార్థాల (గంజాయి) నిర్ములన పై అవగాహన సదస్సు 1టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో సీఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దపల్లి *DCP రవీందర్, మరియు గోదావరిఖని ఏసిపి గిరిప్రసాద్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా డీసీపీ మరియు ఏసీపీ గార్లు మాట్లాడుతూ… నిషేధిత గంజాయి మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలన్నారు. మాదకద్రవ్యాల మత్తులో జీవితాలు పాడుచేసుకోవద్దని సూచించారు.గంజాయి మత్తులో నేరాలు చేసి సమాజంలో నేరస్తులుగా మారవద్దని స్పష్టం చేశారు. గంజాయి వాడినా, సాగు,రవాణా చేసినా చట్ట ప్రకారం కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు
👉క్షణ కాలం సంతోషం కోసం విద్యార్థులు నూరేళ్ల జీవితంలోని వెలుగును దూరం చేసుకుంటున్నారని అన్నారు.
👉గంజాయి వంటి మాదకద్రవ్యాల వినియోగం వల్ల దానిని సేవించిన వారి మానసిక వ్యవస్థ దెబ్బతింటుంది. ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉంటుంది. అమాయక యువత తెలిసీ తెలియక దీని బారిన పడుతోంది.
👉విద్యార్థి దశలోనే గాడి తప్పుతూ డ్రగ్స్ మత్తులో పడి యువత తమ బంగారు భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నారని అన్నారు.అనేక కారణాలతో కొందరు మత్తు పదార్థాలకు అలవాటుపడుతున్నారని అన్నారు.
👉పాన్‌షాపుల్లో రోల్ పేపర్ అమ్మకాలకు పాల్పడే వారిపై కేసులను నమోదు చేస్తాం అన్నారు.
👉ప్రతి పట్టణం, కాలనీ, గ్రామంలో కొంతమంది యువకులు గంజాయి సేవిస్తున్నట్లు సమాచారం ఉందన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, యువతపై దృష్టిసారించాలన్నారు.
👉గంజాయి మత్తులో ఎలాంటి ప్రమాదాలకు పాల్పడతారో తెలియని పరిస్థితిలో ఉంటారన్నారు. అలాంటి వ్యక్తుల ప్రవర్తనపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు తెలిపారు.
*కార్పొరేటర్లకు విజ్ఞప్తి*
1టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని 33 డివిజన్ల కార్పొరేటర్లకు మరియు ప్రజలకు తెలియజేయునది ఏమనగా…మీ డివిజన్లలో గాంజాయి అమ్ముతున్నట్లు గాని కొన్నట్లు గాని, సేవిస్తున్నట్లు గాని, పోలీస్ కి సమాచారం అందించాలి గంజాయి పూర్తిగా నిర్ములించే దిశగా కార్పొరేటర్లు, ప్రజలు, యువకులు ప్రతి ఒక్కరు పోలీస్ కి సహకరించాలని ఎవరి ఏరియాలో వారు పూర్తిగా గంజాయి నిర్ములించాము అని నిర్దారణ చేసుకున్నాక పోలీస్ వారికి కార్పొరేటర్లు ఒక సర్టిఫికెట్ ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.
*పీడీ యాక్టు నమోదు చేస్తాం*
గంజాయి రహిత జిల్లాయే లక్ష్యం. పూర్తిగా నిర్మూలించేందుకు ప్రత్యేక బృం దాలు ఏర్పాటు చేశాం. గంజాయి రవాణా మూలాలను కనుగొని నిర్మూలిస్తాం. యువత కదలికలపై కన్నేసి ఉంచాలి. చెడు వ్యసనాల బారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత పెద్దలపై ఉంది. గంజాయి నిర్మూలనకు ప్రజల భాగస్వా మ్యం కోరుతున్నాం. గంజాయి రవాణా, విక్రయాలు, సాగు చేస్తున్న వారి సమాచారం తెలిస్తే డయల్ 100 కి గాని స్థానిక పోలీస్ అధికారుల నంబరుకు సమాచారం ఇవ్వాలి. వారి పేర్లను గోప్యంగా ఉంచుతాం. నగదు పురస్కారం అంద జేస్తాం. గంజాయి రహిత జిల్లాగా మార్చేందుకు అందరూ కలిసి రావాలి అన్నారు
తదుపరి గంజాయి నిర్ములన గోడపత్రిక ను డీసీపీ, ఏసీపీ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది
ఈ కార్యక్రమంలో *1టౌన్ సీఐ రమేష్ బాబు ,2వ సీఐ రాజ్ కుమార్ గౌడ్* గార్లు ఎస్సైలు ఉమాసాగర్,సతీష్ మరియు కార్పొరేటర్లు,ఆటో డ్రైవర్లు, కార్ అడ్డా ఓనర్లు, డ్రైవర్లు, చుట్టూ ప్రక్కల ఏరియా యువకులు, వారి తల్లిదండ్రులు, ప్రజలు సుమారు 250 మంది పాల్గొనడం జరుగింది.
