అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:

*పెద్దపల్లి లో పెండింగ్ చాలన్ల పై స్పెషల్ డ్రైవ్* పెద్దపల్లి ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఏ.ఎస్సై కిషన్ పెద్దపల్లి బస్టాండ్ ప్రాంతంలో వాహనాల పెండింగ్ చాలన్ల పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ అనిల్ కుమార్ వాహనదారుల తో మాట్లాడుతూ ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత చర్యలు పాటించాలి వాహనదారులు వాహనాలను సురక్షితంగా నడపాలి పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో వాహనదారుల పాత్ర ముఖ్యమైనది  అన్నారు .పెండింగులో ఉన్న  చలాన్ లను వెంటనే చెల్లించాలని వాహనదారులకు అవగాహన కల్పించారు.