అగ్నిధార  న్యూస్, సుల్తానాబాద్;

ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో నిరంతరం కొనసాగుతున్న సేవాకార్యక్రమాలుపెద్దపల్లి జిల్లా,జూలపల్లి మండలంలోని తెలుకుంట,పెద్దాపూర్ ,కుమ్మరికుంట ,వడుకాపూర్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 780 మంది విద్యార్థులకు ఏగోలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ట్రస్టు అధ్యక్షుడు సదయ్య గౌడ్ ₹35100/- రూపాయల విలువ గల N95 మాస్కులను ఒక్కో విద్యార్థికి రెండు చొప్పున పంపిణీ చేసారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా MEO కవిత గారు పాల్గొన్నారు. ట్రస్టు అధ్యక్షుడు సదయ్య గౌడ్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎలిగేడు, ఓదెల మండలాల్లో 1538 మంది విద్యార్థులకు మాస్కులు పంపిణీ చేశామన్నారు. గత పదిహేడు సంవత్సరాలుగా ట్రస్టు ద్వారా పెద్దపల్లి డివిజన్ పరిధిలో నిరుపేద కుటుంబాలకు ఎన్నో సేవకార్యక్రమాలు నిర్వహించామని అన్నారు.ఇట్టి కార్యక్రమంలో పాఠశాల HM లు భారతి గారు, శోభారాణి గారు, అనిత కుమారి గారు, రమేష్ గారు, ట్రస్టు సబ్యులు అమరగొని శ్రీనివాస్, సంధనవేణి ఓమెష్,వలస శివ సాయి తదితరులు పాల్గొన్నారు