అగ్ని ధార న్యూస్ (కల్వకుర్తి)
కల్వకుర్తి మండలం మార్చాల గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ కమిటీ ఆద్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సాధకుడు, రాష్ట్ర జాతిపిత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. కేకు కట్ చేసి పండ్లు పంపిణీ చేసి సంబరాలు నిర్వహించారు. రాష్ట్రం కోసం ప్రాణత్యాగానికి సిద్ధపడి రాష్ట్రం సాధించారని తెలిపారు. అన్నివర్గాలకు సమన్యాయం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మార్చాల గ్రామ బి ఆర్ ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
