స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధం. 

106 మంది స్టేజి వన్ రిటర్నింగ్ అధికారులు.

107 మంది స్టేజి వన్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు.

315 మంది స్టేజి టు రిటర్నింగ్ అధికారులకు శిక్షణ.

శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న అదనపు కలెక్టర్ రెవెన్యూ డి వేణు.

జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య.

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఈనెల ఆరు తేదీన  జారీ చేసిన ఆదేశాల మేరకు,  జిల్లాలోని 266 గ్రామపంచాయతీలకు సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్ల, రెండవ సాధారణ ఎన్నికలు 2025 నిర్వహించుటకు, 106  స్టేజ్ వన్ రిటర్నింగ్ అధికారులను,107 స్టేజ్ వన్ అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులను, 315 మంది స్టేజి టు రిటర్నింగ్ అధికారులను పెద్దపల్లి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కోయ శ్రీహర్ష ఈనెల 10వ తేదీన నియమించారు. ఎన్నికల నిర్వహణకు నియమించబడిన అధికారులకు బుధవారం రోజు జిల్లా సమీకృత కార్యాలయం సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్రస్థాయిలో శిక్షణ పొందిన పదిమంది టీఓటిల ద్వారా ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించామని. పెద్దపల్లి జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్య  తెలిపారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ డి వేణు పాల్గొని మాట్లాడారు. త్వరలో రాబోయే ఎన్నికలను సమర్ధవంతంగా నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులకు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులకు, పలు సూచనలు చేశారు. ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి కాళిందిని, జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, డి ఎల్ పి ఓ వేణుగోపాల్,జిల్లాలోని మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.