కోడి పుంజు కోసం వెళ్లి బావిలో పడి వ్యక్తి మృతి..!

అగ్నిధారన్యూస్ కమాన్ పూర్ 

కమాన్ పూర్ మండలంలోని సిద్దిపల్లె గ్రామానికి చెందిన నామని రాజేశం (70) అనే వ్యక్తి బుధవారం ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబందించిన వివరాలు ఇలా ఉన్నాయి. నామని రాజేశం సిద్దిపల్లెలోని తన వ్యవసాయ భూమిలో సాగు చేసిన వరి పంట కోతకు రావడంతో సంప్రదాయ పద్దతిలో కోడి పుంజును కొనుక్కుని పోత లింగన్న గుడి వద్ద కోసేందుకు సంచిలో నుండి కోడి పుంజును బయటకు తీశాడు. ఈ క్రమంలో కోడి పుంజు ఎగిరిపోయింది. దానిని దొరకబట్టే క్రమంలో ఎగిరిన కోడి పుంజు బావులోకి దూకింది. దానిని పట్టుకునే క్రమంలో రాజేశం ప్రమాదవ శాత్తు కాలు జారీ వ్యవసాయ బావిలో పడిపోయాడు. ఆ సమయంలో ఆ ప్రాంతంలో ఎవ్వరు లేకపోవడంతో రాజేశం బావిలోనే మృతి చెందాడు. కోడి కోయడం కోసం పొలం వద్దకు వెళ్లి తిరిగిరాక పోవడంతో కుటుంబ సభ్యులు వెళ్లి పరిశీలించగా ఆ బావిలో పడిపోయినట్లు గుర్తించారు. ఈ మేరకు కమాన్ పూర్ పోలీసులకు సమాచారం అందించగా లకలయికలో సంఘటన స్థలానికి చేరుకొని పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ బావిలో నుండి రాజేశం మృతదేహన్ని బయటకు తీసి పోస్టు మార్టం నిమిత్తం పెద్దపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కమాన్ పూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.