అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి)
వెల్దండ మండల శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలకపల్లి ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పాపు శెట్టి శ్రీనివాసులు (61) దుర్మరణం చెందారు. ప్రమాదానికి సంబంధించిన వివరాల్లోకెళితే అచ్చంపేట మండల కేంద్రానికి చెందిన శ్రీనివాసులు తెలకపల్లి ఉన్నత పాఠశాలలో హెచ్ఎంగా విధులు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం విధులకు హాజరయ్యేందుకు తన కారులో వెళుతున్నారు. ఈ క్రమంలోనే వెల్దండ సమీపంలో కారు కల్వర్టును వేగంగా ఢీ కొట్టింది. ఈ సంఘటనలో శ్రీనివాసులుకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు గమనించి కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించడం జరిగింది. స్థానికులు విశ్వప్రయత్నం చేసిన ఫలించలేదు.ఈనెల 17 న పదవి విరమణ కావడంతో, వేసవి సెలవులలో ఉపాధ్యాయులు విద్యార్థులతో కలిసి ఉద్యోగ పదవి విరమణ కార్యక్రమం జరుపుకుందాం అనుకున్నారు. ఈవిషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్ డి ఇ ఓ రమేష్ మరియు ఉపాధ్యాయులు ప్రభుత్వ హాస్పిటల్ కి చేరుకొని మృతదేహానికి నివాళులర్పించారు.
