ఉప్పల ట్రస్టు ఛైర్మెన్ ఉప్పల వెంకటేష్
అగ్ని ధార న్యూస్ (కల్వకుర్తి)
తలకొండపల్లి మండలo చీపునుంతల గ్రామానికి చెందిన గడ్డం మీది జంగమ్మ భర్త రాములు నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో వారు నిర్మించుకుంటున్న ఇంటి నిర్మాణం అసంపూర్తిగా మిగిలిపోవడంతో స్థానిక నాయకులతో కలిసి రాష్ట్ర మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ని సంప్రదించడం జరిగింది. వెంటనే స్పందించి ఇండ్ల నిర్మాణంలో భాగంగా సిమెంట్ బస్తాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు ఉప్పల వెంకటేష్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో, మాజీ సర్పంచ్ మoడ్ల వెంకటయ్య, నరోత్తం రెడ్డి, జనార్దన్ రెడ్డి, బత్తుల బాల కుమార్ గౌడ్, గిరి ,గుమ్మడి రాజు , గోస్కే మధు, శ్రీరామ్, మల్లేష్ ,తదితరులు పాల్గొన్నారు.
