ప్రభుత్వ కళాశాలకు పేరు తెచ్చిన బాలిక
అగ్నిధారన్యూస్ సుల్తానాబాద్
సుల్తానాబాద్ మండల కేంద్రంలోని రేగడి మద్దికుంట గ్రామానికి చెందిన గుడికందుల సమ్మయ్య మమత కూతురు రాణి పెద్దపల్లి లోని మహాత్మాగాంధీ జ్యోతిరావుపూలే జూనియర్ బాలికల కళాశాలలో చదువుతోంది. మంగళవారం రోజున వెల్లడించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం సీఈసీ ఫలితాల్లో 500 మార్కులకు గాను 482 మార్కులతో పెద్దపెల్లిజిల్లాలోనే రికార్డ్ సృష్టించింది. పరీక్ష సమయంలో తనకు సహకరించిన కళాశాల ప్రిన్సిపాల్ కు, లెక్చరర్స్ కు రుణపడి ఉంటానని, ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ కళాశాలలో కూడా ఇలాంటి మార్కులు తెచ్చుకోవచ్చునని ఆమె నిరూపించింది.
