ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్న ఎమ్మెల్యే కి ధన్యవాదములు.

కందుల అశోక్ యూత్ కాంగ్రెస్ యువకులు సబ్బితం.

అగ్నిధారన్యూస్ పెద్దపల్లి
దశాబ్దాల కాలంగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నటువంటి సబితం వాటర్ ఫాల్స్ ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని దాని ప్రస్తావన ప్రజా కాంగ్రెస్ ప్రభుత్వం ఆధునికరణలోకి తెస్తూ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అభివృద్ధికి కంకణం కట్టుకున్నారని
సబితం గ్రామ యువకులు కందుల అశోక్ అన్నారు.
గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సబితం వాటర్ ఫాల్స్ ని సందర్శించి దీని అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పూర్తిస్థాయిలో నిధులు కేటాయించి దీన్ని నియోజకవర్గంలోని అత్యద్భుతమైన వాటర్ ఫాల్స్ గా అభివృద్ధి చేస్తానని చెప్పిన మాట తప్పకుండా వాటర్ ఫాల్స్ అభివృద్ధికి 6 కోట్లు నిధులు కేటాయించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. భవిష్యత్తులో మరిన్ని నిధులు కేటాయించి రాష్ట్రస్థాయిలో ఒక మంచి పర్యాటక కేంద్రంగా తయారు చేస్తానని హామీ ఇచ్చినందుకు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎమ్మెల్యే కి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు, ఒక పత్రిక ప్రకటనలు అశోక్ హర్షం వ్యక్తం చేశారు.