డ్రగ్ ఇన్స్పెక్టర్ ఫిర్యాదు.
హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు మొగిలి సతీష్.
అగ్నిధారన్యూస్ కరీంనగర్ క్రైమ్:
కరీంనగర్ పట్టణంలో ఇందిరానగర్ లోని రెనీ హాస్పిటల్ లో కాలం చెల్లిన మందులు విక్రయిస్తు.. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటు, హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షుడు మొగిలి సతీష్ హాస్పిటల్ పై ఫిర్యాదు చేశారు. మెడికల్ షాప్, హాస్పిటల్ పై పూర్తిస్థాయి విచారణ చేసి లైసెన్సు రద్దు చేయాలని గురువారం కరీంనగర్ లొని డ్రగ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. పట్టణంలోని ఇందిరా నగర్ ప్రాంతంలో గల రేనే హాస్పిటల్ లో గత కొంతకాలంగా ఆసుపత్రికి వచ్చిన రోగులకు కాలం చెల్లిన మందులతో వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు. ఇటీవల జిల్లా కేంద్రంలో నివాసముండే మహిళ అనారోగ్యంతో హాస్పిటల్లో ఆరోగ్య పరీక్షల కోసం వచ్చింది, డాక్టర్ పరిశీలించి మందులు రాయడంతో మందులు తీసుకోవడానికి ఆస్పత్రిలో ఉండే మందుల షాపుకు వెళ్లి మందులు తీసుకోవడం జరిగింది. అందులో కొన్ని ఔషధాలు ( కాలం చెల్లిన ) ఎక్స్పైరీ డేట్ ముగిసిన మందులను రోగికి అంటగట్టి సొమ్ము చేసుకున్నారు. ఈ విధంగా అమాయక ప్రజలతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఆసుపత్రిపై పూర్తిస్థాయిలో విచారణ చేసి లైసెన్సు రద్దు చేయాలని ఫిర్యాదులో డిమాండ్ చేశారు. తన వెంట జిల్లా సెక్రెటరీ వేముల సుదర్శన్ రెడ్డి ఉన్నారు.


