ఆర్జీ-3 జి.యం

అగ్నిధార న్యూస్ రామగిరి :

మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుందని రామగుండం – 3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు అన్నారు.బుధవారం “యాంటీ డ్రగ్స్ డే” మాదకద్రవ్యాల వినియోగ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జియం కార్యాలయం నందు అధికారులు, ఉద్యోగులతో కలిసి మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞను చేశారు.

ఈ సందర్భంగా జియం మాట్లాడుతూ….

మాదకద్రవ్యాల వినియోగం వ్యక్తి ఆరోగ్యానికి, కుటుంబ సమైక్యతకు అపార నష్టం కలిగిస్తుందని యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండి ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా కొనసాగాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు సంతోష్, రవికుమార్, అధికారుల సంఘం అధ్యక్షులు సి.హెచ్.వెంకటరమణ, ఎస్వోటుజియం యం.రామ్మోహన్, ఏరియా సేఫ్టీ ఆఫీసర్ భాను ప్రసాదరావు, ఐఇ డీజీయం కె.చంద్రశేఖర్, పర్సనల్ విభాగధిపతి బి.సుదర్శనం, ఏరియా సర్వే అధికారి జనార్ధన రెడ్డి, ఏరియా సెక్యూరిటీ ఆఫీసర్ షబ్బీరుద్దీన్, పర్చేజ్ అధికారి ఇ.నాగేశ్వరరావు తోపాటు ఇతర అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.