ప్రైవేట్ ఉపాధ్యాయుల జీవితాలతో చెలగాటం…..
. ఆర్థిక ఇబ్బందులతో మానసిక వేదన.
నిరాశ్రయులుగా కూలీలుగా మారుతున్న వైనం….
అగ్నిధార గోదావరిఖని//టౌన్
సమాజంలో విలువలతో కూడిన ఉత్తమమైనది ఉపాధ్యాయ వృత్తి, కానీ ప్రస్తుత సమాజంలో ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారడమే కాకుండా ఆర్థిక పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న వైనం కొనసాగుతుంది, చాలీచాలని జీతాలతో తమ కుటుంబాలను పోషించుకుంటూ దేశ భవిష్యత్తుకు ఆధారమైన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి సమాజంలో ఉన్నతమైన స్థితికి ఎదగడానికి దోహదం చేస్తున్నారు, కానీ ఉపాధ్యాయుల జీవితాలు కొవ్వొత్తి లాగా కరిగిపోతూ తమ జీవితాలలో చీకటి చూస్తూ బ్రతుకుతున్నారు, అనిపెద్దపల్లి జిల్లా కమిటీ అధ్యక్షులు కె ఎస్. నందు, కన్నూరి లక్ష్మణ్ రావు అన్నారు. దీనికి నిదర్శనంగా స్థానిక మార్కండేయ కాలనీలోని బ్రిలియంట్ గ్రామర్ పాఠశాలలోని యాజమాన్యం 2024లో మార్కండేయ కాలనీలోని అతి సమీపంలో ఉన్నటువంటి వివేకానంద హై స్కూల్ యాజమాన్యంతో పాఠశాలను మేడ్జ్ చేయడం జరిగింది కానీ, పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం మూడు నెలల జీతాన్ని ఇవ్వకుండా మేడ్జ్ చేసిన పాఠశాలలోనే తమకు పెండింగ్ లో ఉన్న వేతాన్ని పొందండి అని చెబుతూ విలీనం చేసిన పాఠశాలలోనే ప్రస్తుతం ఉపాధ్యాయులు కొనసాగుతూ ఉన్న క్రమంలో, అక్కడి యాజమాన్యం కూడా వేతనాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడమే కాకుండా మానసిక ఇబ్బందులకు గురి చేస్తూ పాఠశాల నుండి వెళ్లిపొమ్మని ఒత్తిడి చేయడమే కాకుండా ఎలాంటి సరియైన కారణాలు లేకుండా ఉపాధ్యాయులను తొలగించి వేతనాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారు అన్నారు. మీరు మీ దిక్కున చోట చెప్పుకొమ్మని దురుసుగా ప్రవర్తిస్తూ ఉన్న విషయాన్ని పలువురు ఉపాధ్యాయులు ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీని ఆశ్రయించడం జరిగింది అన్నారు. మూడు నెలల నుండి వేతనాలు లేక కుటుంబ పోషణ ఇబ్బందికర మారిన పరిస్థితులను స్థానిక మండల విద్యాధికారి పాటు జిల్లా విద్యాధికారి దృష్టి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం( హైకోర్టు ) వరకు తీసుకెళ్లి తమకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు తమ వెంట ఉంటామని ప్రైవేట్ టీచర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా కమిటీ ఉపాధ్యాయులకు హామీ ఇచ్చారు.
