సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కల్లెపల్లె ఆశోక్
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి ( అగ్రికల్చర్ న్యూస్ ) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన అకాల వర్షం కారణంగా పెద్దపల్లి జిల్లాలో వరి,పత్తి మొక్కజొన్న వంటి పంటలు నీట మునిగి జిల్లా రైతాంగానికి తీవ్ర నష్టం ఏర్పడింది. వర్షాల కారణంగా నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వమే న్యాయం చేయాలని, పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించేందుకు అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా పంట నష్టపోయిన రైతులు ఎవరు ఆందోళన చెందొద్దని ప్రభుత్వం రైతులకు హామీ ఇవ్వాలని కల్లెపల్లె ఆశోక్,సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ప్రభుత్వాన్ని రైతుల పక్షాన కోరుతున్నానన్నారు. అకాల వర్షాల వల్ల అనేకమంది రైతులునష్టం పోయారు. వేల ఎకరాలలో పంట పొలాలు నష్టపోయిన పరిస్థితి ఉంది అన్నారు.అట్లాగే దాన్యం కొనుగోలు కేంద్రాలలో పోసిన వరి ధాన్యం తడిసి ముద్దయిన పరిస్థితి ఉంది. కాబట్టి ప్రభుత్వం ఏలాంటి నిబంధనలు పెట్టకుండా వరిధాన్యం తక్షణమే కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానని ఒక పత్రిక ప్రకటనలో అశోక్ తెలిపారు.
