పంట నష్ట పోయిన రైతులను ఆదుకుంటా

రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి

అగ్ని ధార న్యూస్ (కల్వకుర్తి)

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు కల్వకుర్తి నియోజక వర్గంలో జరిగిన పంట నష్ట వివరాలను అంచనా వేయాలని అధికారులకు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సూచించారు కల్వకుర్తి మండలం మార్చాల గ్రామ సమీపంలో తెగిన ఎర్రకుంటాను ఎమ్మెల్యే రైతులతో కలిసి పరిశీలించారు అధికారులను అడిగి పంట నష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు.భారీ వర్షాల వల్ల పత్తి పంట వేరుశనగ పంట రైతులు నష్టపోయారని వారిని ఆదుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో పిసిసి అధికార ప్రతినిధి బాలాజీసింగ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆనంద్ కుమార్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి,ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు గుమ్మ కొండ రాములు, సంజీవ్ యాదవ్,పట్టణ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, మార్కేట్ డైరెక్టర్ రమాకాంత్ రెడ్డి, రైతులు వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.