ప్రొసీడింగ్స్ అందజేసిన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి

అగ్నిధారన్యూస్ (కల్వకుర్తి)

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజల గృహ స్వప్నాన్ని సాకారం చేయాలనే లక్ష్యంతో అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో మరియు శాసనసభ్యులు కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో కడ్తాల్ మండల కేంద్రంలో అర్హులైన లబ్ధిదారులకు కాంగ్రెస్ మరియు యూత్ కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆమనగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి ప్రొసీడింగ్స్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆమనగల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గూడూరు భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే పరమా వధని, ప్రతి పేద కుటుంబానికి ఇల్లు కలగాలనే ఆత్మీయతతో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా అర్హులైన కుటుంబాలకు గృహ నిర్మాణానికి కావాల్సిన ఆర్థిక సహాయం అందించడం ద్వారా సామాజిక సమానత్వం దిశగా ప్రభుత్వం ముందడుగు వేసిందని పేర్కొన్నారు. అలాగే, పేద కుటుంబాలకు గృహం కేవలం ఇల్లు కాదు, అది వారి గౌరవప్రదమైన జీవితానికి పునాది అని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలతో ప్రతి పేద కుటుంబం జీవితంలో వెలుగు నింపుతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా లబ్ధిదారులు స్పందిస్తూ ఇది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాగ్దానాలకు నిలువెత్తు నిదర్శనమని అన్నారు. ప్రజలతో ఉన్న బంధం వల్లే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల మనసుల్లో నిలుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు లక్ష్మయ్య, జహంగిర్ ఆలి, జంగీర్ బాబా, బిక్షపతి, యాదయ్య, బుచ్చయ్య, మల్లయ్య, శ్రీను, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి క్యామ రాజేష్, అసెంబ్లీ ఉపాధ్యక్షులు ఇమ్రాన్ బాబా, నాయకులు పారేష్, నరసింహ, రమేష్, సత్యం, శ్రీశైలం, నరేష్, వెంకటేష్, పాండు మరియు తదితరులు పాల్గొన్నారు.