నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి
ఎమ్మెస్సార్ బట్టిపై చర్యలేవి.
12 గంటలు ఘటన స్థలంలోని డెడ్ బాడీ..
తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి..
చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలం.
బాధ్యులను తప్పించే ప్రయత్నం..
పర్యవేక్షణ లోపమే మరణానికి
కారణం..
7.5 లక్షలతో చేతులు దులుపుకున్న బట్టి యజమాని..
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి క్రైమ్
శుక్రవారం పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం రాఘవపురం గ్రామ పరిధిలోని ఎమ్మెస్సార్ ఇటుక బట్టీలో గౌరీ రెడ్డి పేట గ్రామానికి చెందిన గొర్రెల కాపరి మల్లేష్..గొర్రెలను కాస్తూ విద్యుత్ ప్రమాదంతో. మృతి చెందిన విషయం జిల్లాలో సంచలనం సృష్టించింది. విద్యుత్ శాఖ అధికారుల పర్యవేక్షణ లోపం, ఇటుక బట్టి యజమాని నిర్లక్ష్యం. ఓ నిండు ప్రాణం గాలిలో కలిసింది.అదే విషయంపై శనివారం తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా అధ్యక్షులు గుండవేన స్వామి యాదవ్, పెద్ద కలవలలో టి ఆర్ పి కార్యాలయంలో పత్రిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…విద్యుత్ శాఖ అధికారుల, ఎమ్మెస్సార్ ఇటుక బట్టి యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల మల్లేశం చనిపోయాడు అన్నారు. పేదవాడి ప్రాణం ఖరీదు 7: 50 లక్షలేనా..? అని ప్రశ్నించారు. ఉదయం చనిపోయిన వ్యక్తి సాయంత్రం అయినప్పటికీ డెడ్ బాడీని పంచనామాకు ఎందుకు పంపలేదు అని పోలీసులను ప్రశ్నించారు.. ఇటుక బట్టిలో ప్రమాదం జరిగితే బట్టి యజమాని ప్రమాద స్థలికి ఎందుకు ఎందుకు రాలేదని అన్నారు. ముమ్మాటికి
మల్లేశం మృతికి విద్యుత్ శాఖ ఇటుక బట్టి యాజమానీ నిర్లక్ష్యమే కారణమన్నారు ..?
పోలీస్ యంత్రాంగం ఇటుకబట్టి యజమానులపై ఎందుకు కేసు నమోదు చేయలేదు అన్నారు..
కుటుంబ సభ్యుల రోదనలతో చనిపోయిన శవం వద్ద కాపు కాయాల్సిన దుస్థితికి కారణం
మధ్యవర్తులు అన్నారు. ఇటికబట్టి యజమానులతో కుమ్మక్కై కుటుంబ సభ్యులను కేసు చేయకుండా చేశారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నానన్నారు.
ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా తగిన సహాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ పత్రిక సమావేశంలో ఆయనతోపాటు
తెలంగాణ రాజ్యాధికార పార్టీ , జిల్లా ఉపాద్యక్షులు కాసిపేట ఉదయ్‌కుమార్ , రామగుండం ఇంచార్జి బొప్పు జస్వా , నాయకులు బూపెల్లి ప్రసాద్ , పోల్దాసరి రాజయ్య , నర్ల శ్రీనివాస్ తధితరులు. పాల్గొన్నారు..
