అగ్నిధార న్యూస్ ,పెద్దపెల్లి జిల్లా :

పెద్దపల్లి జిల్లాలో కొత్త పండ్ల తోటలు సాగు చేసే రైతులకు ఈ ఆర్థిక సంవత్సరంలో 2021, 2022 రాయితీ ఇవ్వనున్నట్లు ఉద్యానవన జిల్లా అధికారి  జగన్మోహన్ రెడ్డి తెలిపారు .టిష్యూ కల్చర్ అరటికి రూపాయలు 30199 రాయితీ ఉండగా అరటి మొక్కలను ఉద్యానవన శాఖ అనుసరించిన కంపెనీల నుంచి కొనాల్సి ఉంటుందన్నారు హెక్టారుకు 3086 మొక్కలు నాటుకోవాలి అన్నారు. బొప్పాయి తోట కు 22500 రాయితీ ఉండగా, హెక్టారుకు 3086 మొక్కలు నాటుకోవాలి జామ తోట కు హెక్టారుకు 17,600 రాయితీ హెక్టారుకు 1111 మొక్కలు నాటుకోవాలి, మామిడి తోటకు హెక్టారుకు 9840 రూపాయలు హెక్టారుకు 400 మొక్కలు నాటుకోవాలి అన్నారు. నాణ్యమైన అధిక దిగుబడినిచ్చే చీడపీడలు లేని కూరగాయల అయిన టమాటా మీరుప వంకాయ నారు మొక్కలను ఉద్యానవన శాఖ COE సిద్దిపేట జిల్లాలోని ములుగులో పెంచడం జరుగుతుందన్నారు ఈ మొక్కలను 40 శాతం రాయితీ మీద రైతులకు ఇవ్వనున్నట్లు తెలిపారు ఎకరా నారు మొక్కలకు 1500 రూపాయలు టమాట, 1280 రూపాయలు వంకాయ నారు మరియు మిరపమొక్కలకు DDరూపంలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. కూరగాయల పంటలలో, పండ్ల తోటలలో వచ్చే కలుపు నివారణ గాను అధిక దిగుబడి పొందడానికి గాను నాణ్యమైన పంట తీయడానికి మల్చింగ్ విధానంఉపయోగపడుతుందన్నారు హెక్టారుకు 16000 రూపాయలు 50 శాతం రాయితీ మీద ఇవ్వబడుతుంది అన్నారు . రెజువినేషన్ పథకం ద్వారా 15 సంవత్సరాలు పైబడిన మామిడి తోటల పునరుద్ధరణకు 50 శాతం రాయితీ ద్వారా హెక్టారుకు 20 వేల రూపాయలు అందించడం జరుగుతుందన్నారు ఈ పథకం ద్వారా సరిగ్గా దిగుబడి లేని చీడపీడలు ఉన్న తోట వాటి కొమ్ములను చెట్టు మొదలు భాగం నుండి 4 5 సీట్లు ఎత్తు వరకు ఉంచి మిగిలిన భాగాలను కత్తిరించాలి, కత్తిరించిన భాగాల పైన బోడాక్స్ పేస్ట్ పూయాలి అన్నారు.

ఇతర వివరాలకు

పెద్దపెల్లి నియోజకవర్గం, A జ్యోతి హార్టికల్చర్ ఆఫీసర్

సెల్ నెంబర్ 8978772188

రామగుండం, మంథిని.J. శ్రీకాంత్ హార్టికల్చర్ ఆఫీసర్

సెల్ నెంబర్7780132284….. సంప్రదించగలరు