అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా:

రాష్ట్ర రాజధాని తరహాలో రామగుండం కార్పొరేషన్ ను తీర్చిదిద్దుతాం మౌలిక వసతుల      కల్పనకు పెద్దపీట.

రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్

రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ లో రాష్ట్ర రాజధాని తరహాలో మౌలిక వసతుల కల్పనకు మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తున్నామని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.

పట్టణ సుందరీకరణ లో భాగంగా శుక్రవారం రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని 42వ డివిజన్ కళ్యాణ్ నగర్ లో పాత కరెంట్ పోల్స్ స్థానంలో కొత్త పోల్స్ వేసే ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై, కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని అన్ని డివిజన్లలో సుమారు 50 లక్షల రూపాయల వ్యయంతో 480 పోల్సును వేస్తున్నట్లు తెలిపారు.పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా ప్రజలకు సంపూర్ణంగా మౌలిక వసతులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు కోట్ల రూపాయలను  కేటాయిస్తున్నట్లు తెలిపారు.   ఇందులో భాగంగా లక్ష్మీ నగర్ లో అస్తవ్యస్తంగా ఉన్న కరెంటు వైర్లను తొలగించి, వాటి స్థానంలో లెవెన్ కె.వి వైర్లు లేకుండా, లీడ్స్ తో ప్రమాదరహితంగా విద్యుత్ సరఫరా జరిగేలా చూస్తామని, అవసరమైన చోట సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేస్తామన్నారు. పారిశుద్ధ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, స్థానిక కార్పొరేటర్ బాల రాజ్ కుమార్, టిఆర్ఎస్ నాయకులు పాతపెల్లి ఎల్లయ్య, రాకం వేణు, మెతుకు దేవరాజ్, ఫ్యాక్స్ చైర్మన్ మామిడాల ప్రభాకర్, బెందే నాగభూషణం గౌడ్, మున్సిపల్ సిబ్బంది, వ్యాపారస్తులు, పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.