అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా:

   నా తెలంగాణ కోటి రతనాల వీణ అని సగర్వంగా  ప్రకటించి తెలంగాణ సమాజంలో జాగృతి రగిలించిన మహనీయుడు అగ్నిధార పేరుతో తెలంగాణ ప్రజల్లో ఉద్యమ చైతన్యం కలిగించిన మన తెలంగాణ సాహితీ సౌరభం, గొప్ప కవి శ్రీ దాశరథి కృష్ణమాచార్య  వర్ధంతి సందర్భంగా  రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఘననివాళులు అర్పించారు ఈసందర్భంగా మాట్లాడుతూ దాశరథికృష్ణమాచార్య 1925జూలై  22 న వరంగల్ జిల్లా చిన్నగూడూరుగ్రామంలో జన్మించారు.ఉస్మానియావిశ్వవిద్యాలయం నుండి  ఇంగ్లీషు సాహిత్యంలో బి ఏ సంస్కృతంఆంగ్లంఉర్దూ భాషల్లో మంచి పండితుడు అన్నారు. చిన్నతనంలోనే భాష మీద పట్టు సాధించి పద్యం అల్లటంలో ప్రావీణ్యం సంపాదించాడు. అన్నారు హైదరాబాదు సంస్థానంలో నిజాం అరాచక ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో చురుకుగా పాలుపంచుకున్నాడు. అగ్నిధార నవలలో  నా తెలంగాణ కోటి రతనాల వీణ అని తెలంగాణ ప్రాంతం మీద తనకున్న ప్రేమను చాటారు  అన్నారు.