అగ్నిధార న్యూస్ ,సుల్తానాబాద్:

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను సాధించాలి
చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
జడ్జి పార్థసారథి రావు

విద్యార్థులు చక్కగా చదువుకొని చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి, ఉన్నత లక్ష్యాలను సాధించాలని సుల్తానాబాద్ మున్సిఫ్ కోర్ట్ జూనియర్ సివిల్ జడ్జి పార్థసారథి రావు అన్నారు. శనివారం ఆజాదే కా అమృత్ మహోత్సవంలో భాగంగా నల్సా న్యాయ సేవా ఉత్సవాలను పురస్కరించుకుని మండల న్యాయ సేవా అధికార సంస్థ, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వోడ్నాల రవీందర్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ పట్టణంలోనీ ఇండియన్ పబ్లిక్ స్కూల్ అవరణలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జీ పార్థసారథి రావు మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు జాతీయ న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో గాంధీ జయంతి అక్టోబర్ 2 నుండి చాచా నెహ్రూ జయంతి నవంబర్ 14 వరకు గ్రామగ్రామాన న్యాయ సేవా అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని తెలిపారు. న్యాయవ్యవస్థను ప్రజల వద్దకు తీసుకువెళ్లే ఉద్దేశంతో న్యాయ సహాయం అందించాలనే భావంతో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. న్యాయ సహాయం పొందాలనుకునే వ్యక్తులు మండల న్యాయ సేవాధికార సంస్థ ను సంప్రదించినట్లయితే తగిన న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. విద్యార్థులు ఇక మంచి లక్ష్యాన్ని ఎంచుకొని లక్ష్యం సాధించేలా కృషి చేయాలని అన్నారు. తల్లిదండ్రులను, గురువులను గౌరవిస్తూ ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. విద్యార్థి దశలోనే చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. అనంతరం విద్యార్థులకు   జడ్జి పార్థసారథి రావు క్విజ్ పోటీలను నిర్వహించి గెలుపొందిన విద్యార్థులకు పెన్నులు బహుమతిగా అందించారు. పలువురు న్యాయవాదులు వివిధ చట్టాల గురించి విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వోడ్నాల రవీందర్, ఏజిపీ మేకల తిరుపతి రెడ్డి, ప్యానెల్ న్యాయవాది అవునూరీ సత్యనారాయణ, న్యాయవాదులు జోగుల రమేష్, సామల రాజేంద్రప్రసాద్, ఆవుల శివకృష్ణ, ఇండియన్ పబ్లిక్ స్కూల్ డైరెక్టర్ మాటేటి సంజీవ్,  ఉపాధ్యాయులు పాల్గొన్నారు