అగ్నిధార న్యూస్, పెద్దపల్లి జిల్లా:

పేద అనారోగ్య బాధితులకు కొండంత అండ సీ.ఎం సహాయనిధి.                                                 రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ 

బుధవారం రామగుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగుండం కార్పొరేషన్ పరిధిలోని అరవై ఎనిమిది మందికి CMRF లబ్ధిదారులు 32లక్షల 63 వేల 400రూపాయల చెక్కులను ఎమ్మెల్యే       కోరు కంటి చందర్  అందించారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని  ప్రజాహిత సంక్షేమ కార్యక్రమాలను                    విజయవంతంగా  అమలు చేస్తూ. తెలంగాణ       రాష్ట్రం సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్  మారిందన్నారు.         తెలంగాణ   రాష్ట్రంలోని సకలవర్గాల సంక్షేమం కోసం సి.ఎం కేసీఆర్‌  ఆహర్నిషలు కృషి చెస్తు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నరని అన్నారు.పేద అనారోగ్య బాధితులకు సీఎం సహాయనిధి కొండంత అండగా నిలుస్తుందని అన్నారు. కార్పోరేట్ ఆసుపత్రుల్లో చికిత్సలు చేయించుకున్న పేద వారికి సీఎం మార్పు పథకం ద్వారా అర్దికంగా అదుకోవడం జరుగుతుందన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పించన్ దారులు కళ్యాణలక్ష్మి లబ్ధిదారులు సి.ఎం కేసీఆర్‌ మా పెద్ద కోడుకని భావిస్తున్నరన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభ్యున్నతికై శ్రమిసస్తున్న సి.ఎం కేసీఆర్‌ పై అసత్య ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ పార్టీలను ఆరోపణలను ప్రజలుముక్తకంఠంతో ఖండించాలన్నారు. రామగుండం నియోజక వర్గంలోని పేదప్రజల సంక్షేమం అభ్యున్నతిపై  నిత్యం కృషి చేస్తున్నామని అన్నారు. ఏ సందర్భం వచ్చినా మన సంక్షేమం కోసం కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు  మద్దతుగా ప్రజలు నిలవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో రామగుండం నగర మేయర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు,  కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు  అధిక సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు.