అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:తుర్కలమద్దికుంట లో మెగా కంటి వైద్య శిబిరం పెద్దపల్లి మండలంలోని తుర్కులమద్దికుంట గ్రామంలో ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ సహకారంతో బుధవారం ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో 152 మందికి ఉచిత కంటి పరీక్షలు నిర్వహించారు.అందులో 25 మందికి కంటిలో శుక్లాలు ఉన్నాయని నిర్దారించారు.వీరికి ఉచిత మధుమేహ వ్యాధి పరీక్షలు నిర్వహించారు.కంటిలో శుక్లాలు ఉన్న 25 మందిని రేకుర్తి ఆసుపత్రి కరీంనగర్ లో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు నిర్వహిస్తామని,వారికి ఉచిత రవాణా భోజన వసతులు కల్పిస్తామని లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ అధ్యక్షులు,నేత్రవైద్య సహాయకులు  పూదరి దత్తాగౌడ్ తెలిపారు.గ్రామ సర్పంచ్ తంగేళ్ల జయప్రద సంజీవ్ రెడ్డి గ్రామంలో సేవ కార్యక్రమాలలో ముందున్న ఫ్రెండ్స్ ఫౌండేషన్ వారిని అభినందించారు.ఫ్రెండ్స్ ఫౌండేషన్ అధ్యక్షులు సయ్యద్ యాసర్ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు సేవ చేయడంలో ఎంతో  సంతృప్తినిచ్చింది అన్నారు. అనంతరం రక్తదానం చేసిన వారికి సర్టిఫికేట్ లు ప్రధానం చేశారు .ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ తెలంగాణ ఐ కేర్ డైరెక్టర్ అబ్దుల్ వాసే, ఫ్రెండ్స్ ఫౌండేషన్ సభ్యులు ఎస్ కె బషీర్,సయీద్ రెహ్మాన్,షారుఖ్,తన్వీర్,నెహాల్,ముక్తియార్,తౌసీఫ్ అన్సార్,హసీబ్, ఉపసర్పంచ్ ఈదునూరి జాన్,యూత్ అధ్యక్షులు యూసుఫ్ పాల్గొన్నారు.