అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:
నిందితుడిని కఠినంగా శిక్షించాలి
పెద్దపల్లి జిల్లా గోదావరిఖని లోని 8వ కాలనీలో తన ప్రేమని నిరాకరించిందని గొడుగు అంజలి అనే యువతిని అత్యంత దారుణంగా పాశవికంగా హత్య చేసిన చాట్ల రాజు అనే ప్రేమోన్మాది ని కఠినంగా శిక్షించాలని ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. పెద్దపల్లి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో విద్యార్థినులతో కలిసి ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం విద్యార్థి సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వాలు మహిళలకు అనుకూలంగా ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపైన దాడులు ఆగడం లేదని అన్నారు. దానికి కారణం క్షేత్రస్థాయిలో చట్టాలు సరైన విధంగా అమలు కాకపోవడమే నని అభిప్రాయం వ్యక్తం చేశారు. దేశంలో సగటున గంటకు ముగ్గురు చొప్పున అమ్మాయిలపైన దాడులు అఘాయిత్యాలు హత్యలు రేపులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా అమ్మాయిలపై జరిగే దాడులపై నా ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలని అన్నారు.అంజలి కుటుంబానికి నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈదునూరి ప్రేమ్ బాలసాని లెనిన్ విద్యార్థులు దీప శిరీష రజిత రమ్య సౌమ్య మౌనిక మనీషా తదితరులు పాల్గొన్నారు.
