అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా:

పెద్దపల్లి జిల్లా గోదావిఖని అంబేద్కర్ చౌరస్తాలో అంజలి యాదవ్ హత్యకు నిరసనగా రాజీవ్ రహదారి దిగ్బంధం.
రామగుండం నగర యాదవ సంఘం ఆధ్వర్యంలో..
పెద్దపల్లి జిల్లా ఎనిమిదవ కాలనీ కె కె నగర్ లో ఇంట్లో కి చొరబడి మంగళవారం రోజున గొడుగు అంజలి ని అతి కిరాతకంగా ఈలపీటతో గొంతు కోసి హత్య చేసిన ఉన్మాది చాట్ల రాజ్ కుమార్ కుఉరి శిక్ష వేయాలని యాదవ చారిటబుల్ ట్రస్టు చైర్మన్ మారం తిరుపతి యాదవ్ డిమాండ్ చేశారు 
బాధితురాలికి న్యాయం జరిగే వరకూ పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు  .పట్టపగలు   నిస్సహాయ రాలైన ఆడపిల్లపై అతి కిరాతకమైన  చర్యను తీవ్రంగా ఖండించారు న్యాయం జరిగేంత వరకు రోజుకో రూపాన జిల్లా వ్యాప్తంగా నిరసన దీక్షలు చేపడతామన్నారు నిందితుని పట్టుకొని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు .రామగుండం నగర యాదవ సంగ అధ్యక్షులు పాతపల్లి రవికుమార్ యాదవ్ మాట్లాడుతూమృతురాలి కుటుంబానికి ఎల్ల వేళలా అండగా ఉంటామని నిందుతిన్ని కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు .రామగుండం యాదవ సంఘం తరపున అంత్యక్రయలకుతక్షణ సాయంగా 5000 రూపాయలు బాధిత కుటుంబానికి అందించటం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి మెండే లింగయ్య యాదవ్ వర్కింగ్ ప్రెసడెంట్ ఆవుల రాజేష్ యాదవ్ ఉపాధ్యక్షులు మేకల పోషం యాదవ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ బోయిని మల్లేష్ యాదవ్ . సదన్ కుమార్ యాదవ్ . సతీష్ కుమార్ యాదవ్ . మనోజ్ యాదవ్ గుండె బోయిన మల్లయ్య యాదవ్ సిద్దు రాజు యాదవ్ వెంకన్న యాదవ్ నూనేటిసదానందం యాదన్ తాత సదానందం యాదవ్ వొజ్జ రాజయ్య యాదవ్ .పెంట రవి యాదవ్ నగర యాదవ సంగ మహిళా నాయకురాలు రమ్యా యాదవ్ పలువురు యాదవ సంఘ నాయకులు భాధితురాలు
కుటుంబ సభ్యులు పాల్గొ న్నారు.