అగ్నిధార న్యూస్పెద్దపల్లి:

పెరిగిన వేతనాలు మున్సిపల్ కార్మికులకు వెంటనే చెల్లించాలి.

ఈరోజు పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయం ముందు సిఐటియు  ఆధ్వర్యంలో  ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది,          ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి ఎరవెల్లి ముత్యంరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు 11వ పిఆర్సి ప్రకారం ఉన్న వేతనం పైన 30 శాతం పెంచుతూ గత జూన్లో ప్రభుత్వ ఆర్థిక శాఖ జీవో విడుదల చేయడం జరిగింది, పెరిగిన వేతనాలను ఇప్పటివరకు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారు, ప్రభుత్వ ఆర్థిక శాఖ ఇచ్చిన ఉత్తర్వులను ఆధారం చేసుకొని మున్సిపల్ బాడీ లో తీర్మానం చేసి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం, అదేవిధంగా మంగల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న కార్మికులకు పెరిగిన వేతనాలు చెల్లించారు, అక్కడ పనిచేస్తున్న కార్మికులు, ఇక్కడ పనిచేస్తున్న కార్మికుల శ్రమ ఒక్కటే అయినప్పుడు వేతనాల్లో తేడా ఎందుకు అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం పెంచిన 30 శాతం ఎంత వేతనాలను మున్సిపల్ బాడీ తీర్మానం చేసి 2021 జూన్ నుంచి గత ఐదు నెలల బకాయి వేతనాలు తో సహా చెల్లించాలని డిమాండ్ చేశారు లేకుంటే రాబోయే రోజుల్లో దశలవారీ పోరాటానికి సిద్ధం అవుతామని హెచ్చరించారు
ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆరెపల్లి చంద్రయ్య, మల్లారపు కొమురయ్య, నాయకులు మామిడిపల్లి శ్రీనివాస్, బడుగు అంజయ్య, బొంకూరి నరసయ్య, ఆవునూరి సదయ్య, సలిగంటి పద్మ, గుండేటి లక్ష్మి, సుశీల తదితరులు పాల్గొన్నారు.