అగ్ని ద్వారా న్యూస్ ,పెద్దపల్లి జిల్లా: ప్రజల శ్రేయస్సు దృష్టిలో పెట్టుకుని గోదావరి నదిపై రక్షణ కవచంగా ఆత్మహత్యల నివారణకై రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ వంతెనపై వేస్తున్న ఫెన్సింగ్ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మంగళవారం పరిశీలించారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి నది నిండుకుండలా మారడంతో మంచిర్యాల, పెద్దపల్లి జిల్లా సరిహద్దుగా వున్న గోదావరి వంతెన కొన్నాళ్ళుగా ఆత్మహత్యలకు అడ్డాగా మారింది.ఆత్మహత్యల నివారణకై వంతెనపై ఫెన్సింగ్ వేయాలని ప్రజలు, సామాజిక కార్యకర్తల నుండి కొన్నాళ్లుగా ప్రతిపాదనలు వస్తుండడంతో, స్పందించిన రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో వంతెనపై ఫెన్సింగ్ నిర్మాణం చేపట్టారు.నిర్మాణ పనులను మంత్రి, ఎమ్మెల్యే సందర్శించి, నిర్మాణ పనులు చేపట్టిన వారికి పలు సూచనలు చేసారు. వారి వెంట మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు పెంట రాజేష్, బాల్ రాజ్ కుమార్, కాల్వ శ్రీనివాస్, బోడ్డు రవీందర్ కుమ్మరి శ్రీనివాస్, ఎన్వి రమణారెడ్డి, ధాతు శ్రీనివాస్, నాయకులు పాతిపెల్లి ఎల్లయ్య, నూతి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.