అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా:

రామగుండం ప్రజల రక్షణగా మెడికల్‌ కళాశాల
 రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్.

రామగుండం ప్రజల ప్రాణాలకు రక్షణగా మెడికల్ కళాశాల నిలుస్తుందనీ ఎలాంటి ప్రాణాంతక అనారోగ్య సమస్యలు తలెత్తిన సింగరేణి సహకారంతో సకాలంలో వైద్యం అవుతుందన్నారు  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ రామగుండం అం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
గోదావరిఖనిలో ప్రారంభం కానున్న రామగుండం మెడికల్ కళాశాల నిర్మాణ ప్రతిపాదిత స్థలాన్ని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మంగళవారం పరిశీలించారు. గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల ప్రాంగణం, గోదావరిఖని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి ముందు ఉన్న స్థల పరిశీలన చేసారు.
అనంతరం వారు మాట్లాడుతూ 510 పది కోట్ల రూపాయల నిధులతో అత్యాధునిక మెడికల్ కళాశాల నిర్మాణం మొదలుపెట్టి, 2022  సంవత్సరంలో ప్రారంభం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. మెడికల్ కళాశాల నిర్మాణంతో ఈ ప్రాంతంలోని నిరుపేద, మధ్యతరగతి ప్రజల వైద్య అవసరాలు తీరనున్నాయన్నారు. ప్రొఫెసర్ స్థాయి నిపుణుల వైద్య బృందం అందుబాటులో ఉండనున్నందున, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు.
ఈ కార్యక్రమంలో  నగర మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిప్యూటీ మేయర్ నడిపెల్లి అభిషేక్ రావు, కార్పొరేటర్లు బాల రాజ్ కుమార్, కాల్వ శ్రీనివాస్, కుమ్మరి శ్రీనివాస్, ఎన్వి రమణారెడ్డి, నాయకులు పాతిపెల్లి ఎల్లయ్య, నూతి తిరుపతి తదితరులు ఉన్నారు.