అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా:

       ప్రజల నాయ సేవాధికార సంస్థ సేవలు             వినియోగించుకోవాలి-                                                సీనియర్ సివిల్ జడ్జి డి.వరుధిని:.                      పెద్దపల్లి  మండలం  మూలసాల   గ్రామంలో మంగళవారం  రోజున  న్యాయ విజ్ఞాన  సదస్సు  నిర్వహించారు  ఈ సందర్భంగా సీనియర్ సివిల్ జడ్జి డి.వరూధిని మాట్లాడుతూ ప్రజల వద్దకు న్యాయం అందించేలా చర్యలు  చేపట్టామని  అన్నారు.

 జాతీయ   న్యాయ   సేవల    దినోత్సవం పురస్కరించుకొని  ఆజాద్ కా అమృత్ మహోత్సవంలో నిర్వహిస్తున్న నాల్సా ఉత్సవాలను ఉద్దేశించి ,అక్టోబర్ 2 నుంచి నవంబర్ 14 వరకు జాతీయ లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల మేరకు మండల లీగల్ సర్వీస్ కమిటీ పెద్దపల్లి పరిధిలోగల అన్ని గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూన్నామని, అందులో భాగంగా   గ్రామీణ ప్రజలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు.మహిళలు బాలికలకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే 181 టోల్ ఫ్రీ  నెంబర్ ను వినియోగించుకోవాలని అన్నారు. రాజీ మార్గంలో సమస్యలు పరిష్కరించుకోవాలి అన్నారు.              పెద్దపల్లి జిల్లా  కేంద్రంలో  సఖి  కేంద్రంలో బాధితమహిళలు,బాలికలు,సఖి కేంద్రం యొక్క  సేవలు వినియోగించుకోవాలని అన్నారు.  ఆర్థికంగా వెనుకబడిన బడుగు, బలహీన వర్గాల ప్రజలు  మండల లీగల్ సర్వీస్ కమిటీ  పెద్దపల్లి ని ఆశ్రయిస్తే ఉచిత న్యాయ సలహాలు న్యాయ సహాయం అందిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు డి.వి రమణ రెడ్డి , మండల సర్పంచుల సంఘం అధ్యక్షులు మూలసాల సర్పంచ్ శంకరయ్య,                            పెద్దపల్లి ట్రైని ఎస్.ఐ. రాజా వర్ధన్,
గ్రామ కార్యదర్శి ,ఉప సర్పంచ్ వార్డు సభ్యులు , స్థానిక ప్రజలు హాజరయ్యారు.