అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా:

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని అమరవీరుల స్థూపానికి సమీపంలో శుక్రవారం రోజు టిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి మహాధర్నా కార్యక్రమానికి   ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు హాజరయ్యారు.  సందర్భంగా ఆయన మాట్లాడుతూ 
యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ ద్వంద వైఖరికి నిరసనగా టిఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పిలుపు మేరకు రైతుల పక్షాన ధర్నా కార్యక్రమం చేపట్టామన్నారు .  
ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ …వరి ధాన్యం కొనాల్సిన కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ రాష్ట్రంపై వివక్ష చూపిస్తుంద‌ని తెలిపారు. ఓ వైపు వ‌రి ధాన్యం కొన‌మ‌ని కేంద్రం చెప్పుతుంటే, స్థానికి బీజేపీ నేత‌లు వ‌రి సాగు చేయాల‌ని రైతుల‌ను రెచ్చ‌గొడుతున్నార‌న్నారు. లేనిపోనిమాట‌లు చెప్పి రైతుల‌ను ఆయోమ‌యానికి గురి చేస్తున్నార‌ని, రాజ‌కీయాల కోసం అమాయకులైన అన్న‌దాత‌ల‌ను మోసం చేయ‌డం మానుకోవాల‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్ర బీజేపీ నేత‌లు కేంద్రాన్ని ఒప్పించి తెలంగాణలో యాసంగి ధాన్యం కొనుగోలు చేసేలా చూడాల‌ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం వాన‌కాలంలో పండిన వ‌రి ధాన్యం కొనుగోలు చేస్తుంటే… బీజేపీ నేత‌లు మాత్రం ప్ర‌భుత్వం వ‌రి ధాన్యం కొనుగోలు చేస్త లేద‌ని అస‌త్య ప్ర‌చారాలు చేస్తున్నార‌న్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గం నుండి పెద్ద మొత్తంలో హాజరైన రైతులు కేంద్ర ప్రభుత్వ విధానాలకు  వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తదనంతరం జెసి లక్ష్మీనారాయణకు వినతి పత్రం సమర్పించారు. ఈకార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ ఎంపీపీ లు, జడ్పీటీసీ లు, మున్సిపల్ ఛైర్మెన్ లు,AMC ఛైర్మెన్ లు,PACS ఛైర్మెన్ లు,రైతు సమితి అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, కౌన్సిలర్ లు,ఉప సర్పంచ్ లు, వార్డు మెంబర్ లు,గ్రామ & పట్టణ శాఖ ల అన్ని కమిటీలు,AMC & PACS డైరెక్టర్ లు,యువకులు, రైతులు, ప్రజలు, తెరాస ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.