అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:
పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం NS గార్డెన్ లో సర్వాయి పాపన్న గౌడ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు మూల మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో లో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సింగం సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌడ కులస్తులకు వైన్ షాప్ టెండర్ లో 15 శాతం కేటాయించడం హర్షణీయం అయినప్పటికీ కొంతమంది గౌడ సంఘాల పేరుతో బినామీగా టెండర్లు వేసినట్లయితే దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాంటివి ఎక్కడని ఉన్నట్లయితే వెంటనే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం రాబోయే రోజుల్లో గౌడ సంఘాలకు పూర్తిస్థాయిలో లో మద్యం అమ్ముకోవడానికి 100% వైన్ షాపులు కేటాయించాలని డిమాండ్ చేశారు ప్రధానంగా గౌడ కులస్తులు అందరూ మద్యం అమ్ముకొని జీవించడమే అనాదిగా వస్తున్న ప్రధాన వృత్తి కాబట్టి ఇ వైన్ షాపులు కూడా మాకె కేటాయించాలని ఈ సందర్భంగా కోరుతున్నారు ఈ సమావేశంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సంపునూరి మల్లేశం గౌడ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తాళ్ళపల్లి లింగయ్య గౌడ్ మల్లయ్య గౌడ్ లక్ష్మణ్ గౌడ్ విష్ణు వర్ధన్ గౌడ్ సతీష్ గౌడ్ కోట సమ్మయ్య గౌడ్ మురళి గౌడ్ నాగుల రాజేశం తదితరులు పాల్గొన్నారు.
