అగ్నిధార న్యూస్, కామారెడ్డి:

ఎవరికి ఏ ఆపద వచ్చినా అన్నా అంటే.. నేనున్నానంటూ తనకు తోచిన సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు బిజెపి నేత మాల్యాద్రి రెడ్డి.
                     నిజామాబాద్ జిల్లా
వర్ని మండలం జలాల్పూర్ గ్రామంలో బిజెపి కార్యకర్త తన తండ్రిని కోల్పోవడంతో దహన సంస్కారాల కొరకు ధనుష్ చారికీ శనివారం బాన్సువాడ నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ (విఎంఆర్ ట్రస్ట్ అధినేత) మాల్యాద్రి రెడ్డి 5000 నగదును సహాయంగా అందించారని వర్ని మండల బీజేపీ అధ్యక్షుడు శంకర్ తెలిపారు. తను అందుబాటులో లేకున్నా తన అనుచరులతో తన వంతు సహాయం అందిస్తుంటాడు. ఎక్కడ ఏ కార్యకర్తకు అన్యాయం జరిగిన, ఎవరికి ఇబ్బంది కలిగినా, తన వంతు సహాయం చేస్తూ ముందుకు సాగుతుంటాడు. నియోజకవర్గ ప్రజలతో మమేకమై ఎవరికి ఏ కష్టం వచ్చినా ముందుండి సహాయం చేస్తుంటాడు. గతంలో పేదింటి కుటుంబీకుల కూతురు పెళ్ళిలకు తన వంతు సహాయంగా 25000 నగదును అందించాడు. అలాగే యువతకు విద్య, వైద్య, పరంగా, ఆర్థికపరంగా,ఎలాంటి ఇబ్బంది కలిగినా తన విఎంఆర్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సహాయం చేస్తూ ఆపద్బాంధవుడిగా ఆదర్శంగా నిలుస్తున్నారు.