అగ్నిధార న్యూస్, కామారెడ్డి:

వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు నిర్వహించిన ఆర్డిఓ: రాజాగౌడ్     కార్తీక మాసం అం అంటేనే పూజలకు ప్రసిద్ధి. భక్తులు ఉదయాన్నే లేచి ఆలయాలకు వెళ్లి దీపాలు వెలిగిస్తూ పూజలు చేస్తుంటారు.

కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల శివారులో వేలిసి తెలంగాణ తిరుమల దేవస్థానంగ ప్రసిద్ధి చెందిన వెంకటేశ్వర స్వామిని కార్తీక శనివారం రోజున అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు.
ఇందులో భాగంగా బాన్సువాడ ఆర్ డి ఓ రాజా గౌడ్ దంపతులు స్వామివారి సన్నిధానంలో సత్యనారాయణ పూజ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. అదేవిధంగా స్వామివారి సన్నిధానంలో జైతాపూర్ గ్రామానికి చెందిన రామ్ చందర్ రావు పటికబెల్లంతో వారి సంతానాన్ని తులాభార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మద్దినేని నాగేశ్వరావు,నరసరాజు, ఆలయ కమిటీ సభ్యులు ప్రధాన అర్చకులు నందకిషోర్, ఆలయ మేనేజర్ విట్టల్ పాల్గొన్నారు.అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు.