✍️✍️ శ్రీనివాస్                                           అగ్నిధార ప్రతినిధి,నిజామాబాద్:

పండిట్ జవహర్లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకుని నవంబర్ 14 తేదీని బాలల దినోత్సవంగా జరుపుకుంటారు కాబట్టి, ఆ రోజు ఎప్పుడు వస్తుందా అని పిల్లలందరూ ఎదురుచూస్తూ ఉంటారు. ఆ రోజు వచ్చిందంటే చాలు చిన్నారుల మొహంలో ఆనందం వేళ్లి విరుస్తుంది.
బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లా అర్సపల్లి గ్రామంలో వివేక్ పబ్లిక్ స్కూల్ యజమాన్యం బాలల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. పిల్లలు రకరకాల వేషధారణతో అలంకరించి, నృత్యాలతో సందడి చేశారు. సమాజంలో ప్రతి ఒక్కరికి చదువు ఎంత ముఖ్యమైనదో తెలియజెప్పే నాటికను ప్రదర్శించి గ్రామస్తుల, మరియు విద్యార్థుల తల్లిదండ్రుల, మన్ననలను పొందారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్రీలక్ష్మి మాట్లాడుతూ.. గత రెండు సంవత్సరాలుగా కరోన వల్ల విద్యార్థులు చదువుకు దూరమై ఇబ్బంది పడ్డారని, వారికి ఆటపాటల ద్వారా చదువును అందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమాలు విచ్చేసిన తల్లిదండ్రులకి గ్రామస్తులు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్ చింత అర్జున్, కరస్పాండెంట్ చింత కిరణ్ కుమార్, అలేఖ్య, శృతిక, లక్ష్మీప్రియ, సవిత, లక్ష్మీదేవి, కృష్ణవేణి, సవిత, గంగజ్యోతి, స్వాతి, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.