అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి జిల్లా:. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక NS ఫంక్షన్ హాల్లో పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణ రావు హాజరై మాట్లాడుతూ….ఎంతో మంది విద్యార్థుల అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రం ఈరోజు దోర గడిలో బందీగా మారిందని అన్నారు .తెలంగాణ రాష్ట్రంలో కెసీఆర్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని, ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తున్నమని చెబుతూ బానిస తెలంగాణగా మారుస్తున్నారని, ద్వజమెత్తారు. నిన్న జరిగిన TRS ధర్నా కార్యక్రమం స్వాతంత్ర భారతదేశ చరిత్రలోనే గుర్తించుకోవాల్సిన సందర్భం అని అధికారంలో ఉండి ధర్నాలు చేయడం పాలకుల దౌర్భాగ్యం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన పంటను కొనుగోలు చేసే విషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ధర్నాలు చేయడం విడ్డూరమని అన్నారు. అది పోను పండించిన పంటను కొనుగోళ్ల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు విషం చిమ్ముతున్న ట్లు నాటకం ఆడుతున్నాయి అన్నారు.ప్రభుత్వాల వాదనలు ఎలావున్న రైతులు తమ బాధలను ఎవరికి చెప్పుకోవలన్నదే ప్రశ్నగా మిగిలిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన, రైతుల పక్షాన ,ఉండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచుతాం అని హెచ్చరించారు. ప్రజా సమస్యల పై ప్రతిపక్షాలు ధర్నాలకు పిలుపునిస్తే ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు, చేసే పోలీసులు నిన్న టీ.ఆర్.ఎస్ నిర్వహించిన ధర్నాల విషయంలో ఎంతమంది టీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేశారో ప్రజలకి తెలపవలసిన అవసరం ఉందని అన్నారు రు. పెద్దపల్లి ధర్నా విషయానికొస్తే స్థానిక ప్రజాప్రతినిదులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ కు వెళ్ళే దారులను మూసివేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసి ధర్నా చేయడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్రంలో ముగ్గురు బీజేపీ ఎంపీలు ఒకరు కేంద్ర మంత్రి ఉన్న రాష్ట్రానికి ఒరిగింది ఏం లేదన్నారు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న అంతర్గత పంటలు ఆరుతడి పంటలు ఏం వేయాలో రైతులకు స్పష్టత ఇవ్వాలన్నారు. కొనుగోలు విషయంలో కూడా స్పష్టత కావాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వానికి స్పష్టత లేదని ఎద్దేవా చేశారు.ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లాకాంగ్రెస్ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య , పార్టీ ప్రధాన కార్యదర్శి గాండ్ల మోహన్ మాట్లాడుతూ… పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల పెంపు నిత్యవసర సరుకుల పెరుగుదలపై ప్రజల దృష్టిని మరల్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దొంగ నాటకాలు ఆడుతున్నాయని రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి కేంద్ర ప్రభుత్వం అనేక మంది రైతుల చావులకు కారణమయ్యిందనీ ఇటు రాష్ట్రంలో కెసిఅర్ పాలన తుగ్లక్ కంటే అధ్వానంగా ఉందనీ తెలంగాణా ప్రభుత్వం ప్రజలను నిలువునా ముంచుతుందనీ ముఖ్యమంత్రి కెసిఅర్ కు ఎన్నికలు తప్ప ఈ రాష్ట్ర సమస్యల పై ఏమాత్రం చిత్తశుద్ది లేదనీ అన్నం పెట్టే రైతన్న కొనుగోలు కేంద్రాల వద్ద ప్రాణాలు విడుస్తున్న పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైన చేతనైతే రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలనీ లేకపోతే బిజేపి టీ.ఆర్.ఎస్ ప్రజా ప్రతినిదులు మూకుమ్మడి రాజీనామాలు చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా మైనారిటీ సెల్ అద్యక్షులు ఎస్ కే అక్బర్ అలీ సురేష్ గౌడ్ నాయకులు నుగిల్ల మల్లయ్య సుభాష్ నేతెట్ల కుమార్ శ్రీమాన్ బూతగడ్డ సంపత్ ఈర్లస్వరూప కడర్ల శ్రీనివాస్ సర్వర్ పాషా ఫిరోజ్ ఖాన్ మసూద్ గుర్రాల రాజు తమ్మడబోయిన రాజ్ కుమార్ సుత్రపు పరమేశ్వర్ పేర్కసంతోష్ బొడ్డుపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
