అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:

20 మందికి కంటి శస్త్ర చికిత్సలు విజయవంతం.

నవంబర్ 10 బుధవారం రోజున పెద్దపల్లి మండలం తురకల మద్దికుంట లో నిర్వహించిన ఉచిత కంటివైద్య శిబిరం నుండి శనివారం రోజున 20 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు రేకుర్తి కంటి ఆసుపత్రి కరీంనగర్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ తెలంగాణ ఐ కేర్ అధ్యక్షులు,నేత్రవైద్య సహాయకులు లయన్ పూదరి దత్తాగౌడ్ , పర్యవేక్షణలో విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతి శుక్రవారం శస్త్ర చికిత్సలు ఉచిత రవాణా,భోజన వసతులతో నిర్వహిస్తామని,అవసరం ఉన్నవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరారు. ఈ సందర్భంగా శిబిరాన్ని నిర్వహించిన క్లబ్ డైరెక్టర్ లయన్ అబ్దుల్ వాసే మరియు ఫ్రెండ్స్ ఫౌండేషన్ వారికి గ్రామస్థులు కృతజ్ఞతలు తెలియజేశారు.