అగ్నిధార న్యూస్, పెద్దపల్లి:
పెద్దపల్లి మండలం దేవునిపల్లి లక్ష్మి నరసింహ స్వామి స్వామి ఆలయానికి ప్రతియేటా సమకూరు తున్న ఆర్థిక వనరుల విషయంలో EO శంకర్ ఏలాంటి లెక్కలు చూపడం లేదని గ్రామస్తుడు చిట్యాల శ్రీనివాస్ పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నిర్వహించిన సమీక్ష సమక్షంలో ఆరోపించాడు. ఈ క్రమంలో ప్రతియేటా లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి సంబంధించిన నిధులు పక్కదారి పట్టడం లేదంటూ ఆలయ లావాదేవీలకు సంబంధించిన రిజిస్టర్ ను చూపే ప్రయత్నం చేశారు E O శంకర్. ఎమ్మెల్యే కలుగజేసుకొని జాతర సజావుగా జరిగేలా చూడాలని జాతరకు వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని ఆదేశించారు. జాతర ముగిసిన అనంతరం లెక్కల పైన సమీక్ష నిర్వహిస్తానని అన్నారు . ఈ కార్యక్రమంలో సర్పంచులు కిషన్ కారేశారద శ్రీనివాస్ MPTC పందిళ్ళ లక్ష్మణ్ బండారు శ్రీనివాస్ మార్కు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
